2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మండలంలోని పాఠశాలలకు అందించవలసిన పాఠ్యపుస్తకాలు శనివారం ఎర్రగుంట్లకు చేరినట్లు మండల విద్యాశాఖ అధికారులు శివ ప్రసాద్, వెంకటేశ్వర్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 43వేల పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం సరఫరా చేయవలసి ఉండగా, ఇందులో 50 శాతం మండల కేంద్రానికి చేరాయని తెలిపారు. మిగిలిన పుస్తకాలు పునఃప్రారంభమయ్యే సమయానికి పాఠశాలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.