అక్రమ నియామకాలపై సిబిఐ విచారణ చేపట్టాలి

80చూసినవారు
అక్రమ నియామకాలపై సిబిఐ విచారణ చేపట్టాలి
యోగి వేమన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అక్రమ నియామకాలపై సిబిఐ విచారణ చేపట్టి.. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. 2019- 24 మధ్య 191 నాన్ టీచింగ్ ఉద్యోగాలు అక్రమంగా నియమించారన్నారు. ఒక్కొక్కరి నుండి 3 నుండి 7 లక్షలు దాకా వసూలు చేసి ఇష్టం వచ్చినవారికి అమ్ముకున్నారన్నారు. సిబిఐ విచారణ చేపట్టి అక్రమార్కులపై క్రిమినల్ కేసు నమోదు చేసే శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్