కోదాడ : పురపాలక సంఘం అధ్యక్షురాలు వంటిపులి అనిత జన్మదిన వేడుకలు మునిసిపల్ సిబ్బందితో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగ నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చైర్పర్సన్ అనితకు మునిసిపల్ కమీషనర్ కందుల అమరేందర్‌రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మునిసిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భముగా ఆమెతో పెద్ద కేక్‌ను కట్ చేయించి స్బీట్లు పంపీణీ చేశారు. అనంతరం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు స్యయంగా అందజేశారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా ఇమ్యూనైజేషన్ సెంటర్లో గది నిర్మాణానికి సహాకరికించిన చైర్‌పర్సన్‌ను ఈ సందర్భముగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆమెనువైద్యాధికారి నెమ్మాది రజని సత్కరించారు. కాగా స్థానిక శనగల రాధాకృష్ణ మానసీక వికలాంగుల కేంద్రంలో మానసీక వికలాంగుల సమక్షంలో కేక్‌కట్ చేసి వారికి స్వీట్లు పంపీణీ చేశారు. కాగా మునిసిపల్ చైర్పర్సన్ వంటిపులి అనితను ఆమె జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని కోదాడకు చెందిన ఎంబీసీ కులాలకు చెందిన ప్రతినిధులు ఆమె ఇంట్లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ రాజకీయంగా మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాలలో సూర్యాపేట జిల్లా ఎంపీసీ అధ్యక్షుడు వంటిపులి నాగరాజు, ఎంబీసీ నాయకులు గోవిందరావు, రాధకృష్ణ, వీరభద్రాచారి, శ్రీనివాసరావు, లింగయ్య, సూర్యం, ఉపేందర్, కౌన్సిలర్లు ఖజాగౌడ్, వేలాద్రి, మునిసిపల్ సిబ్బంది లక్ష్మణ్‌నాయక్, సత్యారావు, వరుణ్, పిచ్చయ్య, ఉద్దండు, చందర్రావు, శ్రీనివాసరావు, నయీమ్, తదితరలు పాల్గొన్నారు.