ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. నీటిని దిగువకు పంపేందుకు గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మంగళవారం రాత్రి 10 గేట్లను పదేసి అడుగుల మేర పైకి ఎత్తారు. దిగువన నాగార్జున సాగర్‌కు 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.