రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

73చూసినవారు
రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి
మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ గడ్ జిల్లా పిప్లోడీ ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తాపడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ కు చెందిన వీరు ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముర్ము, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :