ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు 2వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని యూఎస్-హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయుకాలుష్యమే మరణాలకు రెండో ప్రధాన కారకంగా ఉందని వెల్లడించింది. దీనిని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్‌పై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.