214 మంది ఐసోలేట్: మంత్రి వీణాజార్జ్

58చూసినవారు
214 మంది ఐసోలేట్: మంత్రి వీణాజార్జ్
కేరళలోని మలప్పురంలో నిపా వైరస్ వ్యాప్తి చెందడంపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. నిపా వైరస్ బారిన పడి 14 ఏళ్ల బాలుడు చనిపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామానికి చెందిన 214 మంది ప్రైమరీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారని, వారిలో 60 మంది హైరిస్క్‌లో ఉన్నారని తెలిపారు. వారందరినీ ఐసోలేట్ చేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్