47శాతం మత్స్యకార మహిళలే..

69చూసినవారు
47శాతం మత్స్యకార మహిళలే..
రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 14వ తేదీ నుండి సముద్రంలో చేపల వేటపై నిషేధం తొలగిపోయింది. దీంతో తీర ప్రాంతానికి మళ్లీ కళ వచ్చింది. 2022 నాటి మత్స్యశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారుగా 8.75 లక్షల మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 4.13 లక్షల మంది మహిళలు. అంటే, దాదాపుగా 47 శాతం!. రాష్ట్ర జిఎస్‌డిపిలో మత్స్యకార రంగం వాటా 6.01 శాతం!. దీనిలో మహిళల శ్రమ వాటా గణనీయంగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ప్రభుత్వం నుండి వీరికి ఎటువంటి మద్దతు లభించడం లేదు.

సంబంధిత పోస్ట్