వయనాడ్‌లో సహాయక చర్యలు జరుగుతున్న క్రమంలో మరిన్ని ఆందోళనకర విషయాలు బయటకొటున్నాయి. తాజాగా ముండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు వచ్చిన 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైనట్లు హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ తెలిపారు. దీనికి తోడు స్థానిక మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కూడా దెబ్బతినడంతో వారిని కాంటాక్ట్ అవ్వడం మరింత సమస్యగా మారింది.