వయనాడ్ విషాద ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభావిత గ్రామాలకు చెందిన బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని సీఎం వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాలకు చెందిన 8వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చామన్నారు. 82 రిలీఫ్ క్యాంపుల్లో వారంతా ఆశ్రయం పొందుతున్నారని విజయన్ చెప్పారు.