మహారాష్ట్రలోని థానేలో ఓ అపార్ట్మెంట్ లోని ఐదోవ అంతస్తు నుంచి పెంపుడు కుక్క తనపై పడటంతో రోడ్డుపై వెళ్తున్న 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఆగస్టు 6న జరగ్గా, గురువారం రాత్రి కుక్క యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో కలిసి, చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుక్క యజమానితో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు FIR నమోదు చేశారు.