ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బాలిక సోహన్వికారెడ్డి తైక్వాండో పోటీల్లో అదరగొట్టింది. జులై 21వ తేదీ బెంగళూరులో నిర్వహించిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ తైక్వాండో విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. తలుపుల మండలం, గంజివారిపల్లె గ్రామానికి చెందిన గుణరంజన్ రెడ్డి కుమార్తె సోహన్విక రెడ్డి చిన్నప్పటి నుంచి క్రీడలపై ఎనలేని ఆసక్తి కనబరుస్తోంది.