విద్యార్థుల్లో చాలా మంది విచక్షణ కోల్పోతున్నారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీ జహంగీర్‌పురి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి విద్యార్థిని మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. గాయాలపాలైన బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి పాల్పడ్డ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జువైనల్ హోంకు తరలించినట్లు వెల్లడించారు.