పాలు తాగుతున్న కుక్కపిల్ల పైనుంచి కారు పోనిచ్చాడు(వీడియో)

551చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. కారు నడుపుతున్న ఓ వ్యక్తి పాలు తాగుతున్న కుక్కపిల్లను తొక్కించుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. నెమ్మదిగా వెళ్తున్న కారులోని వ్యక్తి ఎదురుగా కుక్క పిల్ల ఉందనే విషయాన్ని గమనించాడు. కానీ ఆగకుండా ముందుకు వెళ్లడంతో కారు కుక్కపిల్ల పైనుంచి వెళ్ళింది. దాంతో రక్తపు మడుగులో ఆ కూన విలవిలలాడి చనిపోయింది. దాని తల్లి దీన స్థితిలో చూస్తూ వుండిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you