మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వింత సంఘటన జరిగింది. తమ తల్లిదండ్రులు ఫోన్, టీవీ చూడనివ్వడం లేదంటూ పిల్లలు వారిపై పోలీస్ కేసు పెట్టారు. 21 ఏళ్ల అమ్మాయి, 8 ఏళ్ల తన తమ్ముడితో కలిసి చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 2021లో ఈ ఘటన జరగ్గా, జిల్లా కోర్టు విచారణలో నేర నిరూపణ జరిగి కోర్టు శిక్షార్హులుగా తీర్పునిచ్చింది. దానిని సవాల్ చేస్తూ ఆ తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లారు. ఇవాళ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.