విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సోమవారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఏపీఏసీ కార్యాలయంలో భేటీ కానుంది. రాష్ట్రం రెండుగా విడిపోయి పదేళ్లు అయినా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడంతో వాటిపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణ సీఎస్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది.