కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. భోజనం తిని తన రూమ్‌కు వచ్చి మంచం మీద పడుకుంటుండగా.. సీలింగ్ ఫ్యాను ఒక్కసారిగా ఊడి మీద పడటంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు.