సిద్దిపేటలో మూడేళ్ళ చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

585చూసినవారు
సిద్దిపేటలో మూడేళ్ళ చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
సిద్దిపేటలో మూడేళ్ళ చిన్నారిపై ఓ కామందుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన అజయ్ అనే వ్యక్తి సిద్దిపేటలో ఓ అపార్ట్మెంట్ లో పెయింటింగ్ పని చేస్తున్నాడు. అక్కడే నేపాల్ కు చెందిన ఓ వ్యక్తి వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. అయితే అతని మనవరాలైన 3 ఏళ్ల చిన్నారిని అజయ్ ఆడిస్తానని చెప్పి తన రూమ్లోకి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్