AIIMS డాక్టర్లు నాలుగు కాళ్లతో పుట్టిన 9 నెలల చిన్నారికి 8 గంటల పాటు శ్రమించి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. ఓ కుటుంబానికి నాలుగు కాళ్లు, వెన్నెముక పైభాగంలో భారీ వాపుతో చిన్నారి పుట్టింది. అయితే తమ బిడ్డ వికృత రూపాన్ని చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురై.. 2024 మార్చి 6న ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు అన్ని టెస్ట్స్ చేసి చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.