గుజరాత్‌లో జంబూసర్ తహసీల్ స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం ఉంటుంది. అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఈ ఆలయం ఒకటి. అయితే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివలింగం రోజుకు రెండు సార్లు అదృశ్యమై కాసేపటికి తిరిగి కనిపిస్తుంది. అసలు శివలింగం ఎలా అదృశ్యమవుతుందో.. తిరిగి ఎలా కనిపిస్తుందో శాస్త్రవేత్తలు సైతం ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. అయితే శివునికి జలాభిషేకం చేయడానికి స్వయంగా సాగరుడు వస్తాడని.. ఆ సమయంలో శివుడు అదృశ్యమవుతాడని స్థానికుల నమ్మకం.