నేడు లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో యూపీలో ఓ వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకునేందుకు గుర్రంపై వచ్చాడు. తన పెంపుడు గుర్రాన్ని అందంగా అలంకరించి దానిపై స్వారీ చేసుకుంటూ పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఇది చూసి క్యూలో ఉన్న ఓటర్లతో పాటు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదేమిటని అడగగా.. తను చాలా దూరం నుండి వస్తున్నానని, ఎక్కడికి వెళ్లినా గుర్రంపైనే ప్రయాణం చేస్తానని బదులు ఇచ్చాడు.