నడి రోడ్డుపై యువకుడిని కర్రలతో కొట్టి చంపారు.. వీడియో వైరల్

83చూసినవారు
యుపిలోని కాన్పూర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సాహిల్ పాశ్వాన్‌ అనే వ్యక్తిని ఐదుగురు దుండగులు నడి రోడ్డుపై కర్రలతో కొట్టి చంపారు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సెప్టెంబరు 20న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి విశాల్, వివేక్, విక్రమ్, అక్షయ్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్