‘కూలి’లో ఆమిర్‌ఖాన్ నటిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ కనగరాజ్ మాట్లాడారు. తాను ఆమిర్‌ఖాన్‌కు అభిమానినని చెప్పారు. త్వరలోనే ఆమిర్‌తో సినిమా చేస్తానన్నారు. దీంతో ‘కూలి’లో ఆమిర్ ఉన్నాడంటూ ఎప్పటినుంచో వస్తోన్న వార్తలకు బలం చేకూరింది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఆమిర్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. ‘కూలి’లో అతిథి పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం.