నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో రూ.6 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ

69చూసినవారు
నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో రూ.6 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ
తెలంగాణలోని నిజామాబాద్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నరేంద్రతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.2.93 కోట్ల నగదు, 51 తులాల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.1.98 కోట్ల విలువ గల స్థిరాస్తులు, రూ.1.10 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఏసీబీ గుర్తించింది. పట్టుబడిన సొమ్ము మొత్తం రూ.6 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్