నటుడు అజాజ్ ఖాన్ భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు

61చూసినవారు
నటుడు అజాజ్ ఖాన్ భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు
'బిగ్ బాస్' ఫేమ్, ప్రముఖ నటుడు అజాజ్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ముంబై డ్రగ్స్ కేసులో అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ గులివాలాను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగేశ్వరిలోని ఆమె ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఫాలన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 8న కస్టమ్స్ విభాగం అజాజ్ ఖాన్ కార్యాలయంపై దాడులు చేసింది. రూ.35 లక్షల విలువైన 10 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్