అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా

50చూసినవారు
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట శనివారం అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ. ప్రతి నెల 14వ తేదీ రావాల్సిన అంగన్వాడి ఉద్యోగుల వేతనాలు ఇప్పటివరకు అందలేదన్నారు. మినీ అంగన్వాడీలకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని కోరారు. కనీస వేతనం 26, 000 చెల్లించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్