వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 2 రోజుల్లో మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదలనుంది. దీని ప్రభావంతో ఏపీ, యానం, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణులు భానుకుమార్ తెలిపారు. చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.