ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడలో గల లప్పం తయారి పరిశ్రమను గ్రామం నుంచి దూరంగా తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. మంగళవారం లప్పం తయారి పరిశ్రమను పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. పిఓపి పరిశ్రమ కారణంగా ప్రతినిత్యం స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, పరిశ్రమ నుంచి వచ్చే దుమ్ము, ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి పరిశ్రమను తరలించాలన్నారు.