ఈనెల 4న ఆదిలాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

61చూసినవారు
ఈనెల 4న ఆదిలాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈనెల 4న మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రం, పాలిటెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఎంపీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉన్నందున పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీఐ ప్రణయ్ కుమార్ తెలిపారు. స్ధానిక ఐలవ్ ఆదిలాబాద్ నుండి మావల పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కాలనీవాసులు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్