స్కూల్ గేమ్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీల్లో నెన్నెల మండలానికి చెందిన విద్యార్థి రెహమాన్ ఎంపిక అయ్యాడు. మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పోటీలకు ఎంపికయ్యాడు. రెహమాన్ ను హెచ్ఎం ప్రకాష్, పిఈటి రాజేష్ లు ప్రత్యేకంగా అభినందించారు.