పెద్దవాగులో గల్లంతై ఒకరి మృతి

8501చూసినవారు
పెద్దవాగులో గల్లంతై ఒకరి మృతి
కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం దుబ్బగూడా గ్రామానికి చెందిన ఊరడి హనుమంతు ప్రమాదవశాత్తు పెద్దవాగులో పడి మృతి చెందాడు. బుధవారం రూరల్ సిఐ రాంబాబు వివరాల ప్రకారం. ఈనెల 7న చింతపండు అమ్మేందుకు హనుమంతు ఆసిఫాబాద్ మండలం రహపల్లికి వెళ్లేందుకు పెద్దవాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. ఈ మేరకు పెద్దవాగులో గాలించగా. మృతదేహం లభ్యమయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్