విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారత్‌లో ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించనున్నారు.ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చీఫ్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి రెండు దఫాల్లో.. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తామని తెలిపారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు.