సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రీల్స్ చేయడానికి ఫ్యాన్ రెక్కకు ఓ పొడవాటి రాడ్‌ను అతికించింది. ఆ రాడ్‌కు కింద తన స్మార్ట్ ఫోన్ తగిలించింది. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక.. ఫ్యాన్ ఆన్ చేసి మంచంపై నిలబడింది. ఆమె డాన్స్ చేస్తుండగా.. ఫ్యాన్ తిరగడం వల్ల ఫోన్ కూడా ఆమె చుట్టూ తిరుగుతూ రికార్డ్ చేసింది. ఫైనల్‌గా వీడియో చూడగా.. సినిమాటిక్ షాట్ తరహాలో వచ్చింది.