ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వాయుసేన సహాయం

54చూసినవారు
ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వాయుసేన సహాయం
సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ హెలికాప్టర్లతో దేశవ్యాప్తంగా 1750 ప్రదేశాల్లో 1000 గంటలకు పైగా సేవలందించామని వాయుసేన వెల్లడించింది. ఈ సేవలకు తేలికపాటి చేతక్, ALH ధ్రువ్, ఎంఐ-17 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగించినట్లు పేర్కొంది. పోలింగ్‌కు ముందు మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది సామగ్రిని తరలించడం, తిరిగి తీసుకురావడం సవాలుతో కూడుకున్నదని తెలిపింది.

సంబంధిత పోస్ట్