బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్..ఆర్బీఐ కీలక ప్రకటన

57చూసినవారు
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్..ఆర్బీఐ కీలక ప్రకటన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కీలక ప్రకటన జారీ చేసింది. రన్నింగ్‌లో ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకు నామినీల వివరాలను కూడా జోడించాలని ఆదేశించింది. సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ప్రారంభించి బ్యాంకులు నిర్వహించే అన్ని ఖాతాలకు తప్పనిసరిగా నామినీ జోడించాలని పేర్కొంది. ఈ నిబంధన బ్యాంక్ అకౌంట్స్ తెరిచే కస్టమర్లకే కాదు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగిస్తున్న కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.