భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేటి ఉదయం 11:30 గంటలకు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి. ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, లోక్‌సభ డిప్యూటీ లీడర్, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, జేపీ నడ్డా, అలాగే ప్రతిపక్షం తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఖర్గే, ఇతర నేతలు హాజరుకానున్నారు.