ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు. అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని ప్రకటనలో డీసీపీ పేర్కొన్నారు. దుస్తులు మార్చుకుంటానంటే సమయం ఇచ్చామని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా సమయం ఇచ్చామని డీసీపీ ప్రకటనలో చెప్పారు.