వ్యవసాయంలో బిందుసేద్యం అద్భుత ఫలితాలు అందిస్తోంది. ముఖ్యంగా దీనిద్వారా నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో నీటి వృథాను అరికట్టవచ్చు. అలాగే నీటిని నేరుగా మొక్క వేర్లు ఉండే ప్రాంతానికి సరఫరా చేయడం వల్ల 30 నుంచి 50 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. అతి తేలికైన, ఇసుక, బరువైన నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, చదును చేయుటకు వీలులేని భూములు కూడా బిందు సేద్యానికి అనుకూలం.