చాల మందిలో మరణించే రోజు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ విషయంపై శతాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే AI సాయంతో నడిచే డెత్ క్లాక్ యాప్‌ను బ్రెంట్ ఫ్రాసన్ రూపొందించారు. మనం తీసుకునే ఆహారం, వ్యాయామం, ఒత్తిడి, నిద్రవంటి సమాచారం ఆధారంగా మరణ తేదీ గురించి చెబుతుంది. అయితే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారు ఏడాదికి రూ.3 వేల వరకు చెల్లించాలి.