రైల్వే ట్రాక్‌పై ఇనుప స్తంభం.. తప్పిన పెను ప్రమాదం

52చూసినవారు
రైల్వే ట్రాక్‌పై ఇనుప స్తంభం.. తప్పిన పెను ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో రాంపుర్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. బుధవారం రాత్రి 10.18 గంటల సమయంలో రైలు (12091) వెళుతుండగా బిలాస్‌పుర్‌ రోడ్‌ - రుద్రపుర్‌ సిటీ మధ్యలో పట్టాలపై సుమారు ఆరు మీటర్ల పొడవు ఉన్న ఇనుప స్తంభాన్ని లోకోపైలట్‌ గుర్తించారు. దీంతో ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఆపారు. రుద్రాపుర్‌లోని స్టేషన్‌ మాస్టర్‌కు వెంటనే సమాచారం ఇచ్చారు. ట్రాక్ క్లియర్ చేసిన తర్వాత రైలును సురక్షితంగా తీసుకెళ్లారని రైల్వే అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్