దేశంలోనే అతిపెద్ద ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. ఈ వివాహానికి వివిద దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా తాజాగా వీరి పెళ్లి పత్రిక వీడియో వైరల్ అవుతోంది. బాక్స్ ఓపెన్ చేయగానే 'ఓం' అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన టెంపుల్.. లోపల వినాయక, దుర్గామాత, విష్ణుమూర్తి విగ్రహాలు దర్శనమిస్తాయి. వీటిని అంబానీ ఫ్యామిలీ స్వయంగా అతిథులకు అందజేస్తోంది.