AP: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర (40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం లేకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబంతో కలిసి తోటకెళ్లి ఉరేసుకున్నారు. భార్య వాణి (38), పిల్లలు గాయత్రి (12), భార్గవ్ (11)కు ఉరివేసి, అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది.