జర్మనీలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పలువురు పెట్టుబడిదారులతో బుధవారం ప్రత్యేకంగా మంత్రి దుర్గేష్ భేటీ అయ్యారు. ఏపీ పర్యాటకాభివృద్ధి అవకాశాలు, వనరుల గురించి మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరుకావడం సంతోషంగా ఉందని తెలిపారు.