ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ అన్ని పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలను రద్దు చేసింది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.