తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు. వారం రోజుల్లో గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. ఈ నెల 20 వరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు. సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని చెప్పారు. రానున్న నాలుగేళ్లు రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని.. రేవంత్ సీఎంగా పూర్తికాలం ఉంటారని అన్నారు.