హైదరాబాద్-రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వజ్రోత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో డిసెంబర్ 20, 21 తేదీల్లో వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొ. అల్దాస్ జానయ్య తెలిపారు.