నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు రెండు బిల్లులు
TG: గత సోమవారం ప్రారంభమయ్యి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి పునః ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో నేడు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉ. 10 నుంచి 11 వరకు తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ MLAలకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. ఈరోజు సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.