యూపీలోని బిజ్నోర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మన్నన్ జైదీ అనే యువకుడు మెహర్ జహాను అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల భర్తపై ద్వేషం పెంచుకుని మన్నన్‌కు పాలలో మత్తు మందు ఇచ్చి పలుమార్లు సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు పెట్టింది. తన భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక తాను చేసిన హింస పోలీసులకు తెలియడానికి సీసీ కెమెరాలు పెట్టాడు. తన ప్రైవేట్ పార్ట్‌లను కూడా కోసేందుకు యత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు మెహర్ జహాను అరెస్ట్ చేశారు.