మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పట్టపగలు ఓ యువకుడిపై శుక్రవారం హత్యాయత్నం జరిగింది. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. సౌరభ్ తోమర్ అనే వ్యక్తి పింటో పార్క్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పాతకక్షల కారణంగా అతడిపై ప్రత్యర్థులు దాడికి యత్నించారు. తుపాకులతో కాల్పులు జరపడంతో బాధితుడు ఇంట్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.