“అవతార్ 3” టైటిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

78చూసినవారు
“అవతార్ 3” టైటిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ‘అవతార్‌’ మూవీ ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ ప్రాంఛైజ్ లో వచ్చిన రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ మూడో భాగంపై అప్‌డేట్‌ వచ్చింది. దీని టైటిల్‌తో పాటు విడుదల తేదీని వెల్లడించారు. ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి రెడీగా ఉండండని చిత్ర యూనిట్ పేర్కొంది. వచ్చే ఏడాది డిసెంబర్‌ 19న ఇది విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్